ప్రాణం తీసిన ప్రేమ వివాహాం

ప్రాణం తీసిన ప్రేమ వివాహాం

నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. పట్టణానికి చెందిన ప్రణయ్ ఆరునెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నాడు. తన భార్యను ఆసుపత్రి వద్ద వదిలిపెట్టి వస్తుండగా దుండగులు అతికిరాతకంగా కత్తితో నరికి చంపారు. ఆసుపత్రి గేటు వద్ద మాటు వేసిన దుండగుడు ప్రణయ్‌ మెడపై రెండు సార్లు విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు విలవిల్లాడుతూ ప్రాణాలు కొల్పోయాడు. వారి ప్రేమ వివాహనికి పెద్దలు అంగీకరించలేదని తెలుస్తుంది. అమ్మాయి తరుపు బంధువులు హత్యకు పాల్పడ్డారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.