అత్తను కత్తితో నరికి చంపిన అల్లుడు

అత్తను కత్తితో నరికి చంపిన అల్లుడు

పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యభర్తల మధ్య గొడవలకు కారణమనే అనుమానంతో అత్తను చంపాడు ఓ దుర్మార్గపు అల్లుడు. వివరాల్లోకి వెళితే.. కుక్కనూరు మండలం చింతలగూడెంకు చెందిన రాజా, తన భార్యకు మధ్య గొడవ జరిగింది. భార్యభర్తల మధ్య తగువుకు కారణం అత్త ముడివి నాగమ్మ అని అనుమానం పెంచుకున్నాడు. దీంతో అత్తను ఎలాగైనా చంపాలని ప్లాన్ వేశాడు. వేట కత్తి వెంట తీసుకుని చింతలగూడెం వచ్చిన రాజు అత్త నాగమ్మను దారుణంగా నరికి చంపాడు. తల, మొండెం వేరు చేసి వేరు వేరు ప్రదేశాల్లో పడేశాడు. అనంతరం కుక్కనూర్ పోలీస్ స్టేషన్ వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.