సర్కార్ లో కన్నీరు పెట్టించిన ఆ సీన్ ఏంటి..?

సర్కార్ లో కన్నీరు పెట్టించిన ఆ సీన్ ఏంటి..?

సర్కార్ వివాదానికి తెరపడి.. త్వరలోనే రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను  తమిళనాడులో భారీ ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు.  ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మురుగదాస్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.  

ఈ సినిమాలో ఓ సీన్ ఉందని.. ఆ సీన్ ను నటీనటులకు వివరించే సమయంలో అందరూ కన్నీరు పెట్టుకున్నారని.. ఆ సీన్ షూట్ చేసిన తరువాత ఒకరితో ఒకరు చూసుకోలేదని.. సెట్ అంతా సైలెంట్ అయ్యిందని.. సెట్ లోని ప్రతి ఒక్కరు చాలా బాధపడ్డారని మురుగదాస్ చెప్పారు.  ఆ సీన్ ఏది.. అనే విషయం మాత్రం చెప్పకుండా మురుగదాస్ దాచిపెట్టారు.  మరి ఆ సీన్ ఏంటో తెలియాలంటే నవంబర్ 6 వరకు వెయిట్ చేయక తప్పదేమో.