'సాహో'లో వివాదాలేమైనా ఉన్నాయా ?

'సాహో'లో వివాదాలేమైనా ఉన్నాయా ?

ప్రభాస్ నటిస్తున్న 'సాహో' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఒకటి ఈరోజు విడుదలైంది.  పోస్టర్ చూడటానికి చాలా బాగుంది.  ప్రభాస్ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది.  ఇక పోస్టర్ మీదున్న క్రూ వివరాల్ని పరిశీలిస్తే అందులో నిర్మాతలు, డైరెక్టర్, ఎడిటర్, స్టంట్ కొరియోగ్రఫర్ పేర్లు ఉన్నాయి కానీ సంగీత దర్శకుల పేర్లు మిస్సయ్యాయి.  ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత త్రయం శంకర్, ఎహసాన్, లాయ్ సంగీతం ఇస్తారని ఆరంభంలోనే ప్రకటించారు.  కానీ ఇప్పటి వరకు వారి పేర్లును పెద్దగా హైలెట్ చేయలేదు టీమ్.  ఒకవేళ టీమ్ వారి పేర్లను పొరపాటున మర్చిపోయారా అంత పెద్ద సినిమాలో ఇలాంటి పొరపాట్లు జరిగే ఆస్కారమే లేదు.  మరి దీని వెనుక ఏవైనా వివాదాలున్నాయేమో తెలియాల్సి ఉంది.