నిర్మాతగా మారిన రెహ్మాన్

నిర్మాతగా మారిన రెహ్మాన్

చిన్ని చిన్ని ఆశ అంటూ రంగుల ప్రపంచంలోకి సంగీత దర్శకుడిగా అడుగుపెట్టిన రెహ్మాన్.. అనతికాలంలోనే టాప్ స్టార్స్ తో సినిమాలు చేశాడు.  రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు అంటే సినిమా మ్యూజికల్ గా హిట్ అయినట్టే అనే వాదన అప్పట్లో వినపడింది.  అప్పుడే కాదు ఇప్పుడు కూడా.  స్లమ్ డాగ్ మిలినియర్ సినిమాకుగాను రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్నారు.  ఇప్పుడు హాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా మారిన రెహ్మాన్ ... తొలిసారిగా నిర్మాతగా మారి 99 సాంగ్స్ అనే సినిమాను నిర్మించాడు.  

రెహ్మాన్ కు చెందిన వైఎం మూవీస్, జియో స్టూడియోస్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  విశ్వక్ కృష్ణమూర్తి దర్శకుడు.  సంగీతం ప్రధానాంశంగా సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమాను నిర్మించడంతో పాటు రెహ్మాన్ కథను కూడా అందించారు.  జూన్ 21 వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది.