ముస్లిం సోదరుల సంచలన నిర్ణయం.. కుర్భాని నిలిపివేత..!!

ముస్లిం సోదరుల సంచలన నిర్ణయం.. కుర్భాని నిలిపివేత..!!

బక్రీద్ రోజున ముస్లిం సోదరులు కుర్భానీని నిర్వహిస్తారు.  దేశవ్యాప్తంగా ఈ పండుగ రోజున ఇలా గొర్రెలను బలి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది.  ఈసారి బక్రీద్ పండుగ శ్రావణమాసంలో వచ్చింది.  అందునా శ్రావణ సోమవారం రోజున రావడంతో, బీహార్ లోని ముజఫ్ఫర్‌ పూర్‌ ప్రాంతానికి చెందిన ముస్లిం సోదరులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.  శ్రావణ సోమవారం రోజున కుర్భానీని నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు.  

బీహార్లోని ముజఫ్ఫర్‌ పూర్‌ కు చెందిన ముస్లిం సోదరులు తీసుకున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  ముజఫ్ఫర్‌ పూర్‌ లోని ముస్లిం కుటుంబాలు గరీబ్ నాథ్ మందిర్ కు సమీపంలో ఉంటాయి.  శ్రావణ సోమవారం రోజున గరీబ్ నాథ్ మందిర్లో కావడి ఉత్సవం జరుగుతుంది.  ఆ యాత్రకు భంగం కలిగించకూడదనే ఉద్దేశ్యంతో ముస్లిం సోదరులు ఈ నిర్ణయం తీసుకున్నారట.  మంగళవారం రోజున కుర్భానీని నిర్వహించాలని ముస్లిం సోదరులు నిర్ణయించారు.