ప్రధాని తెలియదని చితక్కొట్టారు..

ప్రధాని తెలియదని చితక్కొట్టారు..

మన దేశ ప్రధాని తెలియదా అని ఒక అమాయక యువకున్ని కొందరు చావబాదారు. మాల్దా జిల్లా కలియాచక్‌కు చెందిన ఓ యువకుడు హౌరా పట్టణంలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. తాజాగా ఆ యువకుడు కూలీ పనులు ముగించుకుని రైల్లో ఇంటికి తిరుగు ప్రయాణం అయ్యాడు. మార్గ మధ్యలో నలుగురు వ్యక్తులు రైలు ఎక్కి సదరు యువకుడు ఉన్న ముందు సీట్లో కూర్చున్నారు. కొంతసమయానికి సరదాగా అతనితో ఆ నలుగురు మాట్లాడారు. అనంతరం మన ప్రధాని ఎవరు? మన  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? జాతీయ గీతం పాడు? అంటూ ఆ యువకుడిని ప్రశ్నలు అడిగారు. నేను చదువుకోలేదు కాబట్టి సమాదానాలు తెలియవని చెప్పాడు. దీంతో ఆగ్రహం చెందిన వారు ఆ యువకుడి చెంప పగలకొట్టారు. ఈ వాగ్వాదంలో యువకుడు ముస్లిం అని గ్రహించి.. నమాజ్‌ ఎలా చదవాలో నీకు తెలుసు కదా? మరి జాతీయ గీతం గురించి తెలీదా? అంటూ మరోసారి చెయ్యి చేసుకున్నారు. అనంతరం బందేల్‌ స్టేషన్‌లో దిగిపోయారు. పక్కనే ఉన్న ఓ ప్రయాణికుడు ఈ ఘటన దృశ్యాలను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Photo: FileShot