రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని అనుకుంటున్నారా... ఇలా చేయండి... 

రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని అనుకుంటున్నారా... ఇలా చేయండి... 

కరోనా కాలంలో ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తిని గురించి ఆలోచిస్తున్నారు.  రోగ నిరోధక శక్తిని పెంచుకుంటే శరీరం అనేక రుగ్మతల నుంచి దూరం చేస్తుంది.  రోగకారక క్రిములతో ఫైట్ చేస్తుంది.  అయితే, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే కొన్ని రకాలా నియమాలను తప్పనిసరిగా పాటించాలి.  మద్యపానం, ధూమపానం రెండింటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి.  అలా దూరంగా ఉంటేనే ఇది సాధ్యం అవుతుంది.  

ప్రతిరోజూ భోజనంలో తప్పనిసరిగా పెరుగు ఉండేలా చూసుకోవాలి.  అలానే శరీరానికి డి విటమిన్ అవసరం చాలా ఉన్నది.  ఉదయం ఎండలో డి విటమిన్ ఉంటుంది.  కాబట్టి ఉదయాన్నే ఎండలో కాసేపు నిలబడటం మంచిది.  అదే విధంగా ఉదయం సమయంలో  కనీసం 15 నుంచి 20 నిమిషాలపాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది.  వ్యాయామం చేయడం వలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇక డ్రైఫ్రూట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.  వీటిలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి.  ఇవి శరీరానికి చాలా అవసరం.  అలానే ప్రతి మనిషి తప్పనిసరిగా 7 నుంచి 8 గంటల నిద్రపోవాలి.  ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోయే విధంగా అలవాటు చేసుకోవాలి.  అప్పుడే శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెప్తున్నారు.