దర్శనానికి వారికి అనుమతి లేదు... నడిచి వెళ్లాల్సిందే...!!

దర్శనానికి వారికి అనుమతి లేదు... నడిచి వెళ్లాల్సిందే...!!

జూన్ 8 వ తేదీ నుంచి దేవాలయాలలో భక్తులకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.  దీని కోసం దేవాలయాలకు సంబంధించిన అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  తిరుమలలో పాటుగా తెలంగాణలో యాదాద్రికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు.  ఇందులో దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నది.  కరోనా కారణంగా దాదాపుగా రెండు నెలలపాటు భక్తులు దేవాలయాలకు దూరంగా ఉన్నారు.

అయితే, జూన్ 8 వ తేదీ నుంచి భక్తులు యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి వస్తారు.  దేవాలయాల్లో తప్పనిసరిగా సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి.  ఒక్కొక్కరికి మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా మార్కింగ్ చేస్తున్నారు.  ఇక గుట్ట మీద ఉన్న ఆలయంలోకి వెళ్ళాలి అంటే భక్తులు కింద నుంచి పైకి నడుచుకుంటూ వెళ్లాల్సిందే.  పైకి ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదు.  అంతేకాదు, పదేళ్ల లోపున్న చిన్నారులకు, 65 ఏళ్ళు దాటిన వారికి ఆలయంలోకి అనుమతి ఉండదని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.