మురళీధరన్ : నేను ఫాస్ట్ బౌలర్  కావాల్సినవాడిని...

మురళీధరన్ : నేను ఫాస్ట్ బౌలర్  కావాల్సినవాడిని...

శ్రీలంక లెజెండరీ లెగ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ గురించి అందరికి తెలుసు. అయితే ఈ స్పిన్నర్ అసలు ఫాస్ట్ బౌలర్  కావాల్సినవాడట. కానీ కొన్ని కారణాల వల్ల స్పిన్నర్ గా మారాను అని తెలిపాడు. ఈ మధ్య భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తో మురళీధరన్ చిట్ చాట్ చేసాడు. అందులో చాల విషయాలను బయటపెట్టిన మురళీధరన్ ఈ విషయం గురించి కూడా చెప్పాడు. నేను శ్రీలంకకు అండర్ 13 ఆడే వరకు ఫాస్ట్ బౌలింగ్ చేసేవాడిని. కానీ ఆ తర్వత నా కోచ్ నన్ను చూసి నువ్వు పొడుగు లేవు కాబట్టి ఫాస్ట్ బౌలింగ్ కు పనికిరావు అని చెప్పాడు. దాంతో నేను స్పిన్నర్ గా మారాను. అందులో కూడా తాను కొన్ని రోజులు ఆఫ్ స్పిన్నర్ గా కొనసాగిన తర్వాత లెగ్ స్పిన్నర్ గా మారాల్సి వచ్చింది అని చెప్పాడు. ఎందుకంటే అప్పటికే మురళీధరన్ జట్టులో ఇద్దరు ఆఫ్ స్పిన్నర్లు ఉండటంతో జట్టులో ఉండటానికి లెగ్ స్పిన్నర్ గా మారాను అని చెప్పాడు. ఇక 1992 లో శ్రీలంక జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన మురళీధరన్ టెస్ట్ లో అత్యధికంగా 800 వికెట్లు, వన్డేలో 534 వికెట్లు, టీ 20 ల్లో 13 వికెట్లు సాధించాడు. ఇక 2011 ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.