షాక్: ఆ దేవాలయంలో ప్రసాదంగా చికెన్, మటన్ బిర్యానీ... 

షాక్: ఆ దేవాలయంలో ప్రసాదంగా చికెన్, మటన్ బిర్యానీ... 

దేవాలయానికి వెళ్తే ప్రసాదంగా లడ్డు, పులిహార దద్దోజనం లేదంటే పొంగలి వంటివి ఇస్తారు.  కానీ, తమిళనాడులోని ఓ ఆలయంలో మాత్రం ప్రసాదంగా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీలు ఇస్తారట. మధురైలో ఉన్న మునియాండి దేవాలయంలో ఈ ఆచారం అమలులో ఉన్నది.  ఇది వింత ఆచారం అనే చెప్పాలి.  ప్రతిరోజూ ప్రసాదంగా బిర్యానీ పెడతారు అనుకుంటే పొరపాటే. ప్రతి ఏడాది జనవరి 24 నుంచి జనవరి 26 వరకు మూడు రోజులపాటు వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తారు.  

ఈ ఉత్సవాలు జరిగే సమయంలో దేవాలయానికి వచ్చిన భక్తుల కోసం బిర్యానీ వండి వడ్డిస్తారు.  ఈ మూడు రోజుల కోసం వెయ్యి కేజీల బియ్యం, 150 మేకలు, 300 కోళ్లను వినియోగిస్తారట.  బాబోయ్ ఇదేం ఆచారం అని షాక్ అవ్వకండి.  అదొక ఆచారం అంతే.  గత 84 ఏళ్లుగా ఇలానే బిర్యానీ వండి భక్తులకు పంచుతున్నారు.