నా లక్ష్యం.. ప్రపంచకప్‌

నా లక్ష్యం.. ప్రపంచకప్‌

2019 ప్రపంచకప్‌లో ఆడటమే నా లక్ష్యం అని ఆసీస్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ తెలిపాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడిన స్టీవ్‌ స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బెన్‌క్రాఫ్ట్‌పై నిషేధం పడిన విషయం తెలిసిందే. అప్పటినుండి వీరు దేశవాళీ టోర్నీలలో ఆడుతున్నారు. తాజాగా ఓ మ్యాచ్ అనంతరం వార్నర్‌ మాట్లాడుతూ... బాల్‌ టాంపరింగ్‌ నన్ను నిరాశకు గురిచేసింది. జరిగిన దానికి సిగ్గుపడుతున్నా. సీఏ విధించిన ఏడాది సస్పెన్షన్‌ను అనుభవిస్తున్నాను. అది పూర్తయిన తర్వాత 2019 ప్రపంచకప్‌లో ఆడటమే నా లక్ష్యం అని తెలిపాడు. ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంది. రెండో వన్డేలో విజయం కోసం ఆసీస్ ఆటగాళ్లు చాలా శ్రమించారు అని వార్నర్‌ చెప్పుకొచ్చాడు.