ఈ న్యూస్ చదవాలంటే... గుండె ధైర్యం ఉండాల్సిందే... హర్రర్ ను తలపించేలా!!

ఈ న్యూస్ చదవాలంటే... గుండె ధైర్యం ఉండాల్సిందే... హర్రర్ ను తలపించేలా!!

హర్రర్ సినిమాలు ఎలా ఉంటాయో చెప్పక్కర్లేదు.  సినిమా అని తెలిసినా ... అందులో లీనం కావడంతో రియల్ గా జరుగుతుందేమో అనే ఫీలింగ్ లో ఉండిపోతాము.  అందుకే హర్రర్ సినిమాలు చూడటానికి చాలామంది జంకుతుంటారు.  అయితే, హర్రర్ సినిమా లాంటి స్టోరీ నిజజీవితంలో జరిగితే...ఎలా ఉంటుంది.  ప్రత్యక్షంగా చూసిన వ్యక్తులు ఎలా ఫీలయ్యి ఉంటారు.  మాములు వ్యక్తులకు గుండెలు మిగిలిపోతాయి.  మనం సీరియస్ గా ఇంట్లో కూర్చిని టీవీ చూస్తున్నప్పుడు పైన సీలింగ్ మీదనుంచి ఎర్రటి రక్తం తలపై పడితే ఎలా ఉంటుంది.  

నిజంగా షాక్ అవుతాం.  ఇలాంటి సంఘటన ఒకటి అమెరికాలో జరిగింది.  అమెరికాలోని మిన్నెసోటాలో ఓ వ్యక్తి తన ఫ్రెండ్ తో కలిసి ఓ ఇంట్లో నివసిస్తున్నారు.  పైన ఉండే మరో ప్లాట్ లో వేరే వ్యక్తులు నివసిస్తున్నారు.  అయితే కింద నివసించే వ్యక్తి ఇంట్లో గోడలు ఉన్నట్టుండి నల్లగా మారిపోయాయి. నల్లటి ద్రవం పైన సీలింగ్ నుంచి గోడల మీదుగా కారింది.  మొదట బాత్ రూమ్ ఏదైనా లీక్ అవుతుందేమో అనుకున్నారు.  కానీ, ఆ ద్రవం అలానే కారుతుండటంతో షాక్ అయిన ఆ యువకుడు నీళ్లతో ఆ నల్లటి ద్రవాన్ని కడిగేందుకు ప్రయత్నించగా... ఆ నల్లటి ద్రవం కాస్త ఎర్రగా మారిపోయింది.  భయంతో అవతలకు దూకిన ఆ యువకుడు... పై ఫ్లోర్ కు వెళ్ళాడు.  

తలుపు దగ్గరకు వేసి ఉన్నది.  మెల్లిగా ఓపెన్ చేశారు.  లోపల విపరీతమైన వాసన వచ్చింది.  బెడ్ రూమ్ లోకి వెళ్లి చూడగా ఓ వ్యక్తి నేలపై పడి ఉన్నాడు.  ఎప్పుడు చనిపోయాడో తెలియదు.  షాకైన ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సాధారణ మరణంగానే పోలీసులు నోట్ చేసుకున్నారు.  అయితే, బ్లడ్ ఎందుకు అలా వచ్చిందో మాత్రం చెప్పలేకపోయారు.  ఇంకా ఆ విషయం తేలాల్సి ఉన్నది.