వైరల్: ఆకాశంలో అద్భుతం... ఆకుపచ్చ రంగులో అగ్నిగోళం... దేనికి సంకేతం... 

వైరల్: ఆకాశంలో అద్భుతం... ఆకుపచ్చ రంగులో అగ్నిగోళం... దేనికి సంకేతం... 

ఈ విశ్వంలో  నిత్యం ఎన్నో వింతలు, విశేషాలు జరుగుతూనే ఉంటాయి .  ప్రతి రోజు కనీసం వంద టన్నుల దుమ్ము ధూళితో కూడిన పదార్ధాలు, రాళ్ళు వంటివి అంతరిక్షం నుంచి భూమి మీద పడుతుంటాయి.   ఇక అప్పుడప్పుడు మనం ఆకాశంలో ఉల్కలు, తోకచుక్కలు, గ్రహశకలాలు వంటివి భూమివైపు వస్తుండటం చూస్తూనే ఉంటాం.   కొన్నిసార్లు అంతరిక్షం నుంచి వచ్చే గ్రహశకలాలు భూమిని డీకొడుతుంటాయి.  ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు జరిగినట్టుగా ఎప్పుడూ చూడలేదు. 

 అంతరిక్షం నుంచి ఉల్కలు లేదా గ్రహశకలాలు వంటివి భూవాతారణంలోకి ప్రవేశించగానే అవి మండిపోయి కిందపడిపోతుంటాయి.  సాధారణంగా ఇలాంటివి ఎరుపు లేదా తెలుపు రంగులో మనకు కనిపిస్తుంటాయి.   అయితే, అంతరిక్షం నుంచి వచ్చిన ఓ అగ్నిగోళం మాత్రం ఎరుపు రంగులో కాకుండా, ఆకుపచ్చ రంగులో  మండుతూ భూమివైపు దూసుకు వచ్చింది.  ఆస్ట్రేలియాలో ఈ వింత కనిపించింది.    ఆస్ట్రేలియాలోని పిల్  బారాలో కనిపించిన ఈ అగ్నిగోళం ఏ ప్రాంతంలో పడింది అన్నది తెలియాల్సి ఉన్నది.   మామూలుగా అయితే దీని గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదు.  కానీ, ఆకుపచ్చ రంగులో ఉండటంతో ఎందుకు ఆ కలర్ లో ఉన్నది అనే విషయంపై  పెద్ద ఎత్తున పరిశోధన చేస్తున్నారు యూఫాలజిస్టులు. గతంలో ఫ్లయింగ్ సాసర్స్ లేవని కొట్టిపారేసిన అమెరికా, వాటి గురించిన కథనాన్ని, ఫ్లయింగ్ సాసర్స్ వీడియోను రిలీజ్ చేసిన తరువాత మరింత క్యూరియాసిటీ పెరిగింది.  దీనిపై కూడా ఇప్పుడు అలాంటి చర్చే జరుగుతున్నది.    కొంతమంది దానిని ఎలియన్స్ అంటున్నారు.. మరికొంతమంది మాత్రం అందులో సల్ఫర్ వంటి మూలకాలు ఉన్నాయని, అందుకే అది ఆకుపచ్చ రంగులో మండుతున్నదని చెప్తున్నారు.   ఈ న్యూస్ మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.