'హీరో' టైటిల్ ఏ హీరో సినిమాకో మరి !

'హీరో' టైటిల్ ఏ హీరో సినిమాకో మరి !

టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో మైత్రీ మేకర్స్ కూడ ఒకటి.  ఆరంభం నుండి పెద్దగానే ఆలోచిస్తూ భారీగా సినిమాలు నిర్మించే ఈ సంస్థ నుండి 'జనతా గ్యారేజ్, శ్రీమంతుడు, రంగస్థలం'లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు బయటికొచ్చాయి. 

ఈ సంస్థ కొద్దిరోజుల క్రితమే ఫిల్మ్ చాంబర్స్ లో 'హీరో' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించింది.  అయితే ఈ టైటిల్ ఏ హీరో సినిమా కోసమో ఇంకా తెలియరాలేదు.  ప్రస్తుతం ఈ బ్యానర్ పై రవితేజ, శ్రీను వైట్లలు చేస్తున్న 'అమర్ అక్బర్ ఆంథోనీ', విజయ్ దేవరకొండ నటించిన 'టాక్సీవాలా', నాగచైతన్య,  చందూ మొండేటిల 'సవ్యసాచి' వంటి సినిమాలు రూపొందుతున్నాయి.