చరణ్ ను రెండుసార్లే అలా చూశాను..!!

చరణ్ ను రెండుసార్లే అలా చూశాను..!!

రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న వినయ విధేయ రామ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది.  ఈ వేడుకకు ముఖ్యఅతిధులుగా రంగస్థలం నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవి, మరో నిర్మాత భోగవల్లి ప్రసాద్ లు వచ్చారు.  ఈ సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవి మాట్లాడారు.  

రంగస్థలం సినిమా షూటింగ్ ను గుర్తు చేసుకుంటూ.. సినిమా షూటింగ్ సమయంలో చరణ్ మామూలు డ్రెస్ లో చూడలేదని.. షూటింగ్ జరిగిన మొత్తం మీద రెండుసార్లు మాత్రమే మాములుగా చూశానని.. ఉదయం సెట్స్ కు వచ్చిన దగ్గరి నుంచి ప్యాకప్ చేసి వెళ్లిపోయే వరకు క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి అలాగే చేసేవారని" నిర్మాత రవి పేర్కొన్నారు.