కరోనా సెకండ్ వేవ్ : క్లాత్ తో తయారు చేసిన మాస్కులు వాడితే ప్రమాదం తప్పదా !

కరోనా సెకండ్ వేవ్ : క్లాత్ తో తయారు చేసిన మాస్కులు వాడితే ప్రమాదం తప్పదా !

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. అటు జనాలు..  సెకండ్ వేవ్ దాటికి పిట్టల్లా రాలిపోతున్నారు.   అయితే తాజాగా కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 30 లక్షలు దాటేసింది. ఇండియా, బ్రెజిల్, ఫ్రాన్స్ లలో కరోనా పరిస్థితులు ప్రమాదకార స్థాయికి చేరుకున్నాయి. వాస్తవ మరణాల సంఖ్య భారీగానే ఉంటాయని అంచనా. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 7 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 12 వేల మందికి పైగా మరణిస్తున్నారు. అయితే ఈ కరోనా సెకండ్ వేవ్ ను ఎలా అదుపు చేయాలో ఎవరికి అర్థం కావడం లేదు. భౌతిక దూరం, మాస్క్ లు ధరించడమే మార్గమమని నిపుణులు చెబుతున్నారు. దీంతో చాలా మంది సాధారణ మాస్కులు, క్లాత్ తో తయారు చేసిన  మాస్కులు వాడుతున్నారు. క్లాత్ తో తయారు చేసిన  మాస్కుల కంటే ఎన్-95 లేదా కెఎన్ -95 మాస్కులు వాడటం చాలా మంచిదని అమెరికా మేరీలాండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఫాహిమ్ యూ నస్ పేర్కొన్నారు. రెండు ఎన్-95 లేదా కెఎన్ -95 మాస్కులు కొని,,, ఒక్కోరోజు ఒక్కోటి వాడాలని సూచించారు. ఒకటి వాడిన తర్వాత దానిని పేపర్ బ్యాగ్ లో ఉంచి మరుసటి రోజు వాడాలని తెలిపారు. అవి పాడు కాకపోతే కొన్ని వారాల పాటు వాడుకోవచ్చని పేర్కొన్నారు. క్లాత్ తో చేసిన మాస్కులు ధరించ వద్దని హెచ్చరించారు.