నా నువ్వే ట్రైలర్ టాక్ 

నా నువ్వే ట్రైలర్ టాక్ 

నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటించిన చిత్రం "నా నువ్వే". తమిళ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా ఉండనుంది. మే 25 రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న తరుణంలో ఇవాళే ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆధ్యంతం ఫ్రెష్ గా కొత్త తరం లవ్ స్టోరీని చేస్తున్నామనే ఫీలింగ్ ను కలిగించింది. తమన్నా, కళ్యాణ్ రామ్ ల జంట చుడముచ్చటగా ఉంది. అనుకోకుండా కలిసి..ఆ తరువాత ఆ పరిచయం ప్రేమగా మారడం..సహజీవనం చేయడం వంటి అంశాలతో తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ కూల్ లుక్ తో చాలా బాగున్నాడు. తమన్నా ఒరిజినల్ డబ్బింగ్ కథకు తగినట్లు బాగున్నది. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. కళ్యాణ్ రామ్ శైలికి భిన్నంగా ఈ సినిమాను క్లాసీగా రూపొందించడం విశేషం.