బన్నీ ఇంపాక్ట్ ప్రతిఫ్రేమ్ లో కనబడుతుంది

బన్నీ ఇంపాక్ట్ ప్రతిఫ్రేమ్ లో కనబడుతుంది

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ న్యూ ట్రెండ్ సెట్టింగ్ మూవీ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా'. అంతా పాజిటివ్ టాక్ తో సక్సెస్ ఫుల్ గా నడుస్తుంది. ఈ సినిమా విశేషాలు పంచుకోవడానికి మూవీ టీంతో చిట్ చాట్ జరిపింది ఎన్టీవీ. ఈ ముఖాముఖిలో డైరెక్టర్ వక్కంతం వంశీ, ప్రొడ్యూసర్స్ నాగబాబు, శ్రీధర్, శిరీషా శ్రీధర్ పాల్గొన్నారు. వారు ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం.

యాంకర్ : ఈ సినిమా మంచి సక్సెస్ తో దూసుకుపోతున్నందుకు అందరికీ అభినందనలు. డైరెక్టర్ గా మీకు ఎలాంటి అనుభూతినిస్తుంది? 
వక్కంతం వంశీ: రైటర్ గా చాలా సంవత్సరాలు పరిశ్రమలో ఉన్నా... డైరెక్టర్ గా ఇది మొదటిది కావడంతో చాలా ఎక్సైటింగ్ గా ఉంది.  
నాగబాబు : తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి అల్లు అరవింద్, బన్నీ ప్రోత్సాహంతో తిరిగి ప్రొడక్షన్ లోకి దిగాను. చాలా హాపీగా ఫీల్ అవుతున్నాను ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి. ఇప్పుడు నేను మానసికంగా చాలా సంతోషంగా ఉన్నాను.  
శ్రీధర్ లగడపాటి: బన్నీ మంచి సినిమా చేద్దాం అని కోరి మరీ మా ఇంటికొచ్చి చెప్పడంతో మరేం ఆలోచించలేదు. ఆ భరోసాతో చివరి వరకు ఈ సినిమా చూడలేదు. ప్రేక్షకులతోనే చూశా. చాలా ఆనందాన్ని పొందాను. నాగబాబు సపోర్టును.. బన్నీ సినిమా కోసం పడే తపనకు నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. అదృష్టంతో ఈ అవకాశం నాకు వచ్చింది.  
శిరీష లగడపాటి: రైటర్ డైరెక్టర్ కావడంతో చక్కగా సీన్స్.. డైలాగ్స్ మసపాళ్లలో అమరినవి. రెండు సార్లు చూశాను సినిమాను. మొదటి సారి స్టోరీని. ఆ తర్వాత కేవలం డైలాగ్స్ కోసం. చాలా అద్భుతంగా కూర్చున్నవి. 
యాంకర్ : అల్లు అర్జున్ ని అనకొనే కథ రాశారా? లేకా మరెవరినైనా హీరోని అనుకొని స్టోరీ బిల్డప్ చేశారా? 
వక్కంతం వంశీ: ఐడియా లెవల్లో ఏ హీరోని అనుకోలేదు. బన్నీకి సరిపోయే కథకోసం వచ్చినప్పుడు ఇది కచ్ఛితంగా సరిపోతుందని చేశాం అంతే. 
యాంకర్ : డెబ్యూ డైరెక్టర్ చేసినట్లు ఎక్కడా సినిమాలో కనిపించలేదు... మీరేమంటారు ఈ విషయంపై.? 
నాగబాబు: నాకు వక్కంతం వంశీ పదేళ్ల నుండి తెలుసు. హీరో స్థాయి నుండి రచయితగా వెళ్లాడు. మాకు మంచి కథ ఇవ్వమంటే ఎప్పుడూ ఇవ్వలేదు. లక్కీగా ఇప్పుడొచ్చింది. వంశీ మాకు కథ చెప్పేటప్పుడే విజువలైజ్డ్ గా చూపించేశారు. దాంతో కనెక్టై పోయాం. 
యాంకర్: వక్కంతం వంశీ రైటర్ గా .. డైరెక్టర్ గా మీకు ఎలా అనిపించింది? 
శ్రీధర్ లగడపాటి: నాకు కథ విన్న వెంటనే చాలా బాగుందనిపిచ్చి వెంటనే మీకేం కావాలో మీ ఇష్టం అని చెప్పాను అంతే. నా ఫిలాసపీ ఏంటంటే ప్రజలకు ఆనందాన్నివ్వడానికి సంతోషకరమైన ఉత్పత్తి ఇవ్వాలి అన్నదే. 
యాంకర్ : సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.. లొకేషన్స్ గానీ, ఫైట్స్ అంతా చాలా క్రియేటివ్ గా అనిపిస్తుంది.. దానిపై మీ అభిప్రాయం? 
వక్కంతం వంశీ : ఈ సినిమా అంతా యాక్షన్ తో కూడిన థ్రిల్ ఇస్తుంది. వైలెన్స్ కానీ యాక్షన్ అంతా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఫస్ట్ ఫైట్ అర్జున్ కి యాటిట్యూడ్ కు తగినట్లుగా స్టైలిష్ గా కనెక్ట్ అవుతుంది. 
యాంకర్ : బన్నీ యాక్షన్ గురించి మీరేమంటారు? 
బన్నీ ఇంతకు ముందు చేసిన సినిమాల కంటే ఇది సరికొత్తగా అనిపించింది. ప్రతి సినిమాలో కొత్తగా చేస్తుంటారు. ఇందులో ముఖ్యంగా ఓ మిలటరీ మ్యాన్ యాటిట్యూడ్ మొదటి నుండి చివరి వరకు అక్కడ నుంచి బయటకు వచ్చాడా అనిపిస్తుంటుంది. బన్నీ డెడికేషన్ చాలా అద్భుతం. 
యాంకర్ : సినిమా చూసిన తర్వాత మీకు బన్నీ గురించి ఏమి అనిపించింది? 
శ్రీధర్ లగడపాటి:  బన్నీ అంకితబావం, నిబద్ధత గురించి చెప్పాల్సిన పనిలేదు. ఈరోజు ఈ సినిమాలో ఇన్ని లేయర్స్ ఇంత కాంప్లిక్ట్ పాయింట్ ను ఎవరూ ఊహించని విధంగా చక్కగా చేయడం బాగుంది. సినిమా బాగుండాలి అనే భావంతో బన్నీ ఈ సినిమా చేశారు. ఆ ఇంపాక్ట్ సినిమాలో ప్రతి ఫ్రేమ్ లోనూ కనపడుతుంది. 
ఇంకా ఈ సినిమా టీం ఏం మాట్లాడారో ఎన్ని విషయాలు చర్చించారు అన్నది తెలుసుకోవాలంటే కింది వీడియోను క్లిక్ చేయండి.