అల్లరి నరేష్‌కి నాని సలహా.. ఇక పేరు మార్చేయ్

అల్లరి నరేష్‌కి నాని సలహా.. ఇక పేరు మార్చేయ్

టాలీవుడ్‌లోని కామెడీ హీరోల్లో అల్లరి నరేష్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. తన కెరీర్ ప్రారంభం నుంచి కామెడీ సినిమాలతో భారీ హిట్లు అందుకున్న నరేష్ గత కొంత కాలంగా వరుస ప్లాప్‌లను చవి చూస్తున్నారు. మంచి సినిమాతో ఎలాగైనా మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని నరేష్ ఫిక్స్ అయ్యారు. అందులో భాగంగా కామెడీని పక్కన పెట్టి నాంది సినిమాను ఓకే చేశారు. ఇక ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఈ సినిమా సక్సెస్‌పై నాచురల్ స్టార్ నాని స్పందించారు. నాంది సినిమాలో నరేష్ నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే అల్లరి నరేష్, నాని ఎంత క్లోజ్ ఫ్రెండ్స్‌ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరు ఎప్పుడు కలిసిన తమతమ సినిమాల గురించి చర్చించుకుంటారు. ఒకరి సినిమాకి మరొకరు ప్రమోషన్స్‌లో కూడా సహాయం చేసుకుంటారు. అయితే తాజాగా నాని అల్లరి నరేష్‌పై ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నాంది సినిమాని స్పెషల్ షోలో చూసిన నాని ‘రేయ్ రేయ్ రేయ్ అల్లరి నరేష్ ఇక పేరు మార్చేయ్. అల్లరి గతం, భవిష్యత్తుకి ఇది నాంది’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాకుండా సినిమా హిట్ కావడం చాలా సంతోషంగా ఉందని కూడా అన్నారు. ఈ ట్వీట్‌కి అల్లరి నరేష్ ‘థాంక్యు బాబాయ్’ అంటూ సమాదానం ఇచ్చారు. ఇదిలా ఉంటే నాంది సినిమాతో వచ్చిన హిట్‌ ట్రాక్‌ని అలాగే కొనసాగించేందుకు నరేష్ కొత్త తరహా కథలను ఓకే చేస్తున్నారు. మరి నరేష్ తరువాత ఎటువంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తారో వేచి చూడాలి.