అనుమతి నిరాకరిస్తారా.. పోలీసు వ్యవస్థకే తలవంపులు !

అనుమతి నిరాకరిస్తారా.. పోలీసు వ్యవస్థకే తలవంపులు !

దివిస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఉధృతంగా మారుతోంది... తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేస్తున్నారు... రైతుల ఆందోళన ఆందోళనకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో, పోలీసులు అనుమతి నిరాకరించారు.. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టిడిపి హయాంలో ఫ్యాక్టరీకి అనుమతులతో పాటు ప్రభుత్వ స్థలాన్ని కూడా కేటాయించారు.. రైతుల నుండి 300 వందల ఎకరాలకు పైగా సేకరించి ప్రభుత్వం కేటాయించింది. అయితే ఫ్యాక్టరీ ఏర్పాటు వలన పర్యావరణానికి ముప్పుతో పాటు కాలుష్యం పంట పొలాల పై ప్రభావం చూపుతుందని రైతులు ఎదురు తిరిగారు.. దీంతో టిడిపి ప్రభుత్వ హయాంలో నిర్మాణం ముందుకు సాగలేదు.. 

టిడిపి ప్రభుత్వం ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వడంపై అప్పటి ప్రతిపక్షం వైసీపీ కూడా వ్యతిరేకత వ్యక్తం చేసింది.. స్థానిక రైతులకు మద్దతుగా వైసీపీ నేతలు కూడా ఆందోళన చేశారు .అయితే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఫ్యాక్టరీని నిర్మించేందుకు అనుమతి ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు. దీంతో ఈ వ్యవహారంలో జనసేన పార్టీ కూడా రాజకీయ మైలేజీ కోసం రంగంలోకి దిగింది.. నెలరోజుల క్రితం ఫ్యాక్టరీ ప్రాంతంలో పర్యటించిన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ పది రోజుల్లో సమస్య పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు ..అయితే ప్రభుత్వం పట్టించుకోలేదు ...దీంతో రైతులకు మద్దతు గా పవన్ కళ్యాణ్ ఆందోళనలో పాల్గొనేందుకు తొండంగి వద్దకు రానున్నారు. 

పవన్ కళ్యాణ్ తలపెట్టిన పర్యటనకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో రాజకీయంగా ఈ వ్యవహారం కీలకంగా మారింది.. ఇప్పటికే ఫ్యాక్టరీ వద్ద రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో పోలీసులు 144 సెక్షన్ ని అమలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా పరిస్థితులు ఉండటంతో పవన్ కళ్యాణ్ పర్యటన అనుమతి లేదని జిల్లా ఎస్పీ తెలిపారు. జనసేన పార్టీ నేతలు అనుమతుల కోసం దరఖాస్తు చేసినప్పటికీ సరైన పత్రాలు ఇవ్వలేదని ఆయన అంటున్నారు.  

అయితే వైఎస్సార్సీపీ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని జనసేన నేత నాదెళ్ళ మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  కొత్తపాకల గ్రామంలో 9వ తేదీన ఏర్పాటు చేసిన జనసేన సభకు చివరి నిమిషంలో అనుమతి నిరాకరిస్తారా ? ఇలా ఇప్పుడు ప్రకటించడం అప్రజాస్వామికం, పోలీసు వ్యవస్థకే తలవంపులు అని పేర్కొన్నారు. మొత్తం మీద ఈ వ్యవహారం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది..దివిస్ పరిశ్రమపై టిడిపి, వైసిపి  రైతులను మోసం చేశాయని జనసేన ఆందోళనకి సిద్ధమైంది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో పవన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది..