బీజేపీలో చేరిన నాదెండ్ల

బీజేపీలో చేరిన నాదెండ్ల

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు కొద్దిసేపటి క్రితం బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ కండువా కప్పి  నాదెండ్లను షా సాదరంగా ఆహ్వానించారు.
నాదెండ్లతోపాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీ రామ్మోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి,   రామగుండం డిప్యూటీ మేయర్‌ ఎం సత్యప్రసాద్‌ తదితరులు బీజేపీలో చేరారు. 
1983లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో  ఆర్థిక మంత్రిగా నాదెండ్ల పనిచేశారు. ఆ తర్వాత 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబరు 16 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.