జనసేనలోనేనా? క్లారిటీ ఇచ్చిన నాదెండ్ల..!

జనసేనలోనేనా? క్లారిటీ ఇచ్చిన నాదెండ్ల..!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్, జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న నాదెండ్ల మనోహర్‌.. జనసేనకు గుడ్ బై చెబుతారనే ప్రచారం జోరందుకుంది. తాజాగా జనసేనాని పవన్ కల్యాణ్.. గుంటూరు జిల్లా సమీక్ష నిర్వహించడం.. ఆ సమావేశానికి నాదెండ్ల మనోహర్ హాజరుకాకపోవడంతో.. ఇక ఆయన పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరందుకుంది. దీనిపై క్లారిటీ ఇచ్చారు నాదెండ్ల మనోహర్... తాను జనసేన పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేసిన ఆయన... నేను పార్టీ వీడుతా అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని కొట్టిపారేశారు. విదేశాల్లో ఉండటం వల్ల పార్టీ సమీక్షల్లో పాల్గొనలేక పోయానని.. వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటానని ఓ ప్రకటన విడుదల చేశారు నాదెండ్ల మనోహర్. కొందరు ఉద్దేశ్యపూర్వకంగా నాదెండ్ల మనోహర్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆయన పార్టీని వీడే ప్రసక్తి లేదని జనసేన పార్టీ పేర్కొంది. ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరిన నాదెండ్ల మనోహర్... ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే.