మొద‌టిరోజే పైర‌సీలో `మ‌హాన‌టి'

మొద‌టిరోజే పైర‌సీలో `మ‌హాన‌టి'

పైర‌సీ సినీప‌రిశ్ర‌మ‌కు వంద‌ల కోట్ల మేర న‌ష్టం తెస్తున్న సంగ‌తి తెలిసిందే. యేటేటా వంద‌లాది సినిమాలు పైర‌సీ బారిన ప‌డుతున్నాయి. టాలీవుడ్‌, బాలీవుడ్, కోలీవుడ్ స‌హా అన్ని ప‌రిశ్ర‌మ‌లు పైరేట్‌ల ముందు త‌ల‌వొంచాల్సొస్తోంది.  ఇలా సినిమా థియేట‌ర్ల‌లోకి రిలీజైందో లేదో అలా పైర‌సీ సీడీలు బజార్‌లో దొరుకుతున్నాయి. రోడ్ల‌పై కుప్ప‌లుగా పోసి డీవీడీలు విక్ర‌యిస్తున్నారు. ఆన్‌లైన్ టొరెంట్‌లను యువ‌త ఆశ్ర‌యిస్తున్నారు.

పైర‌సీ మ‌హ‌మ్మారీ `మ‌హాన‌టి` వ‌సూళ్ల‌కు పెద్ద రేంజులోనే గండి కొట్టింద‌ని తెలుస్తోంది. పైర‌సీ మూలాలు అధికంగా ఉన్న‌ది త‌మిళ‌నాడులో. అక్క‌డి నుంచి `న‌డిగ‌య్యార్ తిల‌గం` సినిమా పైరేట్‌ల ప‌రం అయ్యింది. కేవ‌లం త‌మిళ వెర్ష‌న్ మాత్ర‌మే కాదు, తెలుగు వెర్ష‌న్‌ని పైరేట్ చేసి పైర‌సీకారులు డీవీడీల్ని అమ్మేస్తున్నారు. త‌మిళ నిర్మాత‌ల సంఘం అధ్య‌క్షుడు కం హీరో విశాల్ ఇదివ‌ర‌కూ త‌మిళ్‌రాక‌ర్స్ లాంటి పైర‌సీ వెబ్‌సైట్ల‌ను మూయించే ప్ర‌య‌త్నం చేశారు. ప‌లువురు పైర‌సీకారుల‌ను సైబ‌ర్‌క్రైమ్ సాయంతో జైల్లోనూ వేయించాడు. అయినా ఇప్ప‌టికీ పైర‌సీ ఆగ‌డం లేదు. ఇది అంతంలేని వ్య‌స‌నంలా ప‌రిశ్ర‌మ‌ల్ని వేదిస్తోంది. విశాల్ న‌టించిన `ఇరుంబు తిరై` చిత్రాన్ని కూడా పైర‌సీలో రిలీజ్ చేసేయ‌డం ఈ సంద‌ర్భంగా చ‌ర్చ‌కొచ్చింది. కొన్ని సినిమాల విష‌యంలో అయితే మ‌రీ దారుణం. రిలీజ్‌కి ముందే పైరసీ చేసేయ‌డం ఇదివ‌ర‌కూ హాట్ టాపిక్ అయ్యింది.