నడిగర్ సంగం ఎన్నికలు జరగవు

నడిగర్ సంగం ఎన్నికలు జరగవు

 

జూన్ 23న జరగాల్సిన నడిగర్ సంఘం ఎన్నికలు ఆగిపోయాయి.  ఈమేరకు ఎన్నికల్ని  నిలిపివేస్తున్నట్టు సొసైటీ జిల్లా రిజిస్ట్రార్ ఉత్తర్వుల్ని జారీచేశారు.  ఇందుకు ప్రధాన కారణం గత ఎన్నికల్లో ఓటు వేసిన కొందరు ఈసారి తమను ఓటు వేయడానికి అనర్హులుగా ప్రకటించారని రిజిస్ట్రార్ వద్ద కంప్లైంట్ ఇచ్చారు.  ఈ పిర్యాధును పరిశీలించి చర్యలు తీసుకోవడానికి కొంత సమయం పడుతుందని అప్పటి వరకు ఎన్నికల్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు.  గతంలో హైకోర్టు సైతం ఎన్నికలు నిర్వహించే కేంద్రాన్ని మార్చుకోవాలని సంగం సభ్యులకు సూచించింది. ప్రస్తుతం దీనిపై కూడా సందిగ్దత నెలకొంది.