లైవ్‌షోలో మంత్రి చెంప పగిలింది...

లైవ్‌షోలో మంత్రి చెంప పగిలింది...

పాకిస్తాన్ ప్రతిపక్ష పార్టీ అయిన 'పాకిస్తాన్ టెహ్రీన్ ఇ- ఇన్సాఫ్' నేత ఆదేశ అధికార పార్టీకి చెందిన మంత్రిని చెంప పగల కొట్టారు. అర్థిరాత్రి జరిగిన ఓ టీవీ టాక్ షోలో ఇద్దరు ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకొంటూ ఉండగా... ఆ మాటల ఆవేశంలో ప్రతిపక్షనేత  మంత్రి చెంపపగల కొట్టాడు. లాహోర్ నుంచి ప్రత్యక్ష ప్రసారంగా సాగుతున్న ఈ చానల్ లో ఇస్లామాబాద్ స్టూడియోలో లైవ్ టాక్ షోలో ఈ ఘటన చోటు చేసుకుంది. పిఎంఎల్-ఎన్ ప్రభుత్వ మంత్రి డానీయల్ అజిజ్ మాట్లాడుతూ... 'నాయీల్ హక్ ఒక 'దొంగ' అని అన్నారు. దాంతో ఆగ్రహించిన పీటీఐ పార్టీకి చెందిన నేత మంత్రిని చేయిచేసుకున్నారని జియో న్యూస్ సంబంధించిన న్యూస్ రీడర్ మునీబ్ ఫరూక్ తెలిపారు. ఆ తర్వాత మంత్రితో పాటు ఇతర వక్తలు ఆ లైవ్ షో నుండి వాకౌట్ చేశారు. మంత్రి అజీజ్ మాట్లాడుతూ... 'ప్రతిపక్షపార్టీ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. రోజు రోజుకూ ప్రజా మద్దతు సన్నగిల్లుతుండటంతో వారికి కలిగే చిరాకు.. కోపం.. ఒత్తుడులతో ఇలాంటి పనులు చేస్తున్నారు' అని పేర్కొన్నారు.