నాగార్జున మల్టీ స్టారర్లు చేయడం వెనకున్న అసలు రహస్యం ఇదే !
సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున మారుతున్న కాలానికి అనుగుణంగా కథాబలమున్న సినిమాల్ని ఎంచుకుంటూ ముందుకువెళుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఆయన ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలను చేస్తున్నారు. ప్రస్తుతం నానితో కలిసి 'దేవదాస్' సినిమా చేసిన ఆయన ఇలా మల్టీ స్టారర్ సినిమాలు చేయడం వెనకున్న అసలు సంగతిని బయటపెట్టారు.
వయసు మీద పడటంతో లీడ్ రోల్స్ చేయడం సరికాదు. అలాంటి సబ్జెక్ట్స్ కూడ తక్కువగానే ఉంటాయి. అందుకే కెరీర్లో ఈ టర్న్ తీసుకున్నానని అంటున్నారాయన. 'దేవదాస్' చిత్రం ఈ నెల 27న విడుదలకానుండగా తమిళంలో ధనుష్ తో కలిసి ఒక సినిమా, హిందీలో రన్బీర్ కపూర్ తో పాటు ఒక సినిమాలో నటిస్తున్నారు నాగ్.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)