ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అశ్విన్‌

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పిన అశ్విన్‌

ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్, పూజా హిగ్దేలు చేస్తున్న రాధేశ్యామ్ దాదాపు పూర్తి అయినట్టే. ఆ తరువాత బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేయనున్నాడు. అయితే అంతకుముందే ప్రకటించిన నాగ్ అశ్విన్ సినిమా మాత్రం ఎటువంటి అప్‌డేట్ లేకుండా ఆలస్యం అవుతుందని వార్తలు వచ్చాయి. అదేవిధంగా ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమా లేట్ అవ్వదని 2022లో విడుదల చేసేందుకే నాగ్ అశ్విన్ చూస్తున్నాడన్నారు. ఇంతలో స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సలార్ సినిమాకు ప్రభాస్ ఓకే చెప్పాడు. సలార్ సినిమా షూటింగ్‌ కూడా వచ్చే ఏడాది ఆదిపురుష్‌తో పాటుగా చిత్రీకరణ మొదలుకానుంది. అయితే...నాగ్‌ అశ్విన్‌ మూవీ నుంచి ఇంత వరకు ఎలాంటి అప్డేట్‌ రాలేదు.  సంక్రాంతి తర్వాత తమ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్‌ ఇస్తానని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ ఏడాది ఆరంభంలో చెప్పారు. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ జరిగి పదిరోజులు కావొస్తున్నా.. ఎలాంటి అప్డేట్‌ ఇవ్వకపోవడంతో నెటిజన్లు ట్విట్టర్‌ వేదికగా వరుస ట్వీట్లు చేస్తున్నారు. దీంతో స్పందించిన నాగ్‌అశ్విన్‌.. "జనవరి 29న కానీ ఫిబ్రవరి 26న కానీ కచ్చితంగా అప్డేట్‌ ఉంటుంది" అని అన్సార్‌ ఇచ్చారు. ఈ ట్వీట్‌తో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఖుషి అవుతున్నారు.