ప్రభాస్ సినిమా అప్డేట్స్ ఇచ్చిన నాగ్ అశ్విన్...

ప్రభాస్ సినిమా అప్డేట్స్ ఇచ్చిన నాగ్ అశ్విన్...

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.  ఇక ఈ సినిమాను ప్రభాస్ అశ్వినీ దత్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో చేస్తున్నాడు. మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్  అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కనుంది అని తెలుస్తుంది. అయితే ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా తీస్తామని ఒకసారి ట్విట్టర్ వేదికగా తేలియాజేశారు నాగ్ అశ్విన్. అయితే ఈ సినిమా గురించి ప్రభాస్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికి తెలుసు. అయితే అలా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు తన ట్విట్టర్లో స్పందించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ప్రభాస్ అభిమాని ట్విట్టర్లో... స్క్రిప్ట్ కి కాస్ట్ అందరూ ఫిక్స్ అయ్యారా.. ప్రభాస్ నాగ్ అశ్విన్ సమాధానం చెప్పని అని ప్రశ్నించాడు. అయితే దీనికి సమాధానంగా.. స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. కరోనా వాళ్ళ కొన్ని ఆలస్యం అయ్యాయి... కానీ స్క్రిప్ట్ కి ఎక్కువ సమయం పడుతుంది. అలాగే కాస్టింగ్ ఆలోచనలు ఉన్నాయి కానీ ఎవరిని సెలక్ట్ చేయలేదు దానికి ఇంకా టైం ఉంది అని అశ్విన్ సమాధానం ఇచ్చాడు. అశ్వినీ దత్ ఈ  ఈ సినిమాను 2021 చివర్లో కాకుండా 2022 ఏప్రిల్ లో సినిమా విడుదల చేస్తాం అని తెలిపాడు.