నాగ్ అశ్విన్ సినిమాలో ప్రభాస్ సరసన నటించేది..?

నాగ్ అశ్విన్ సినిమాలో ప్రభాస్ సరసన నటించేది..?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'జిల్' ఫెమ్ రాధాకృష్ణ దర్శకత్వం లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . ఈ సినిమా లో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ వైజయంతి మూవీస్ బ్యానర్ లో సినిమా చేస్తున్నాడు. మహానటి సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్  అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం అశ్విన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించే హీరోయిన్ గా బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ముగ్గురిని అనుకుంటున్నాడట! అయితే అందులో ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియదు. ఈ ఏడాది చివర్లో సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని, 2021 చివర్లో సినిమాను రిలీజ్ చేస్తామని అశ్విన్ ఇంతకముందే తెలియజేసారు. అందరూ ఈ సినిమాను పాన్ ఇండియాగా తీస్తారని అనుకుంటున్నారని, పాన్ ఇండియా ఎప్పుడో దాటేశామని, పాన్ వరల్డ్ సినిమాగా తీస్తామని చెప్పారు ఒకసారి ట్విట్టర్ వేదిక తేలియాజేశారు నాగ్ అశ్విన్. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.