మహానటిలో శేఖర్ కమ్ముల పాత్ర..!?

మహానటిలో శేఖర్ కమ్ముల పాత్ర..!?
సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న మహానటి సినిమా ఈనెల 9 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది.  ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  ఇందులో మహానటిగా కీర్తి సురేష్ నటిస్తుంటే.. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, సమంత, మోహన్ బాబు, నాగచైతన్య ఇలా స్టార్ నటులంతా మిగతా పాత్రల్లో నటిస్తున్నారు.  భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా గురించిన ఏ విషయమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రేండింగ్ అవుతున్నది. నటులతో పాటు కొంతమంది దర్శకులు కూడా ఈ సినిమాలో పాలు పంచుకుంటున్నారు.  
దర్శకుడు క్రిష్ ఇందులో కెవి రెడ్డి పాత్రలో నటిస్తుండటం విశేషం.  అయితే, ఈ సినిమాలో ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా తనవంతు సహకారాన్ని అందించాడట.  మహానటి సినిమాలోని పాత్రలకు నటుల ఎంపిక విషయంలో శేఖర్ కమ్ముల అందించిన సహకారం మర్చిపోలేనిది.. నాగ్ అశ్విన్ పేర్కొన్నాడు.  నటీనటులను ఎంపిక చేసుకునే విషయంలో శేఖర్ ఇచ్చిన శిక్షణ ఎంతగానో ఉపయోగపడిందని నాగ్ అశ్విన్ చెప్పాడు.