నాగ చైతన్య మరీ ఇంత స్పీడా !

నాగ చైతన్య మరీ ఇంత స్పీడా !

 

అక్కినేని హీరో నాగ చైతన్య గత సినిమాలు 'సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు, యుద్ధం శరణం' పరాజయం చెందిన సంగతి తెలిసిందే.  అయినా చైతన్య స్పీడ్ తగ్గించలేదు.  వరుసపెట్టి కొత్త సినిమాలకు సైన్ చేస్తున్నాడు.  ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్లో 'మజిలీ' అనే సినిమా చేస్తున్న ఆయన త్వరలోనే బాబీ దర్శకత్వంలో 'వెంకీ మామ' స్టార్ట్ చేయనున్నాడు.  ఈ రెండు కాకుండా కొత్త దర్శకుడితో ఒక సినిమా చేయనున్నాడు.  ఆ చిత్రాన్ని నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నాడు.  చైతన్య మొదటి చిత్రం 'జోష్'ను దిల్ రాజు నిర్మించిన సంగతి తెలిసిందే.  ఆ సినిమా తరవాత వీరిద్దరూ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే.