కొత్త సినిమాను సెట్ చేసుకున్న నాగ చైతన్య

కొత్త సినిమాను సెట్ చేసుకున్న నాగ చైతన్య

గత కొన్ని రోజులుగా అక్కినేని హీరో నాగచైతన్య శేఖర్ కమ్ములతో ఒక సినిమా చేయనున్నారనే వార్త ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే.  ఈ వార్త ఇప్పుడు నిజమైంది.  చైతన్య శేఖర్ కమ్ములకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.  సెప్టెంబర్ మొదటి వారం నుండి షూటింగ్ మొదలుకానుంది.  ఇందులో సాయి పల్లవి కథానాయకిగా నటించనుంది.  శేఖర్ కమ్ముల చివరి చిత్రం 'ఫిదా' భారీ విజయాన్ని సాధించడం, అందులో కూడా సాయి పల్లవి హీరోయిన్ కావడంతో చైతన్య సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు బాగానే ఉన్నాయి.