నా జీవితంలో సూపర్ స్టార్... : నాగ చైతన్య

నా జీవితంలో సూపర్ స్టార్... : నాగ చైతన్య

ప్రేమ, పెళ్లి తర్వాత నాగ చైతన్య, సమంతలు జీవితంలో ప్రతి సందర్భాన్ని చాలా బాగా ఆస్వాదిస్తూ సంతోషంగా గడుపుతున్నారు.  ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా ఎదురయ్యే పెళ్లి తరవాత జీవితం ఎలా ఉంది అనే ప్రశ్నకు ఉత్సాహంగా సమాధానం చెబుతుంటారిద్దరూ.  

తన కొత్త చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' విడుదల సందర్బంగా ట్విట్టర్ ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతున్న చైతన్య పెళ్లి జీవితంలో ఎలాంటి మార్పును తెచ్చింది అని ఒక అభిమాని అడగ్గానే పెళ్లి తర్వాత లైఫ్ చాలా బెటర్ అయింది, నా జీవితంలో సూపర్ స్టార్ సమంత అంటూ సమాధానమిచ్చారు.  ఇకపోతే సమంతతో కలిసి తాను  చేయనున్న సినిమా అక్టోబర్ నుండి కూడ మొదలవుతుందని అన్నారు చైతన్య.