టాలీవుడ్ లోనే కాదు అక్కడ కూడా మజిలీ విజయం 

టాలీవుడ్ లోనే కాదు అక్కడ కూడా మజిలీ విజయం 

టాలీవుడ్ లో నాగ చైతన్యకు మంచి విజయం అందించిన సినిమాల్లో మజిలీ కూడా ఒకటి.  నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమా రూ. 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  నాగ చైతన్య క్రికెటర్ కావాలని కలలు కంటాడు.  క్రికెటర్ కావాలని కలలు కనే మరో అమ్మాయి అతనిని ఫ్రెండ్ అవుతుంది.  ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారుతుంది.  అనుకోని సమయంలో ఆ అమ్మాయి విడిపోతుంది.  

తప్పనిసరి పరిస్థితిల్లో నాగ చైతన్య సమంతను వివాహం చేసుకుంటాడు.  ఆ తరువాత ఇద్దరి మధ్య జరిగే కథను తెరపై అద్భుతంగా చూపించారు.  ఫ్యామిలీ ఆడియన్స్ కు ఈ మూవీ బాగా కనెక్ట్ అయ్యింది.  కాగా, ఈ సినిమాను హిందీలో డబ్ చేసి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో బాలీవుడ్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.  అక్కడ కూడా ఈ సినిమా మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది.  ఫిబ్రవరి7 వ తేదీన రిలీజ్ చేసిన ఈ సినిమా 14 మిలియన్ కు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.  ప్రస్తుతం ఇండియాలో టాప్ 15 గా ట్రెండ్ అవుతున్నది.