ప్రమోషన్ మొదలుపెట్టిన దంపతులు

ప్రమోషన్ మొదలుపెట్టిన దంపతులు

నాగచైతన్య.. సమంత జంటగా నటించిన సినిమా మజిలీ.  వివాహం తరువాత కలిసి నటిస్తున్న తొలి సినిమా ఇదే కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  పెళ్లి తరువాత భార్యాభర్తల మధ్య జరిగే కొన్ని చిన్న చిన్న గొడవలు, అలకలు లైఫ్ లో గెలవలేకపోయిన విషయాలను తలుచుకొని బాధపడే సన్నివేశాలు అన్ని ఈ సినిమాలో చూపించబోతున్నారు.  ప్రతి మనిషి జీవితంలో జరిగే విషయాలను ఈ సినిమా ద్వారా చూసుకోవచ్చు. 

ఏప్రిల్ 5 వ తేదీన సినిమా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ ను మొదలుపెట్టారు.  సమంత, నాగచైతన్యలు మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ప్రమోషన్ చేస్తున్నారు. టీజర్, సాంగ్స్ తో సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.  మరి రిలీజ్ తరువాత సినిమా ఎలా ఉంటుందో చూడాలి.