మజిలీ టీజర్ డేట్ ఫిక్స్..!!

మజిలీ టీజర్ డేట్ ఫిక్స్..!!

నాగచైతన్య.. సమంతలు హీరో హీరోయిన్లు గా చేస్తున్న సినిమా మజిలీ.  వివాహం తరువాత ఇద్దరు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి.  నాగ చైతన్య వరస ప్లాప్ లతో సతమతమౌతున్నారు.  ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న సంగతి తెలిసిందే. 

వరస హిట్స్ తో దూసుకుపోతున్న సమంతతో కలిసి చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఉన్నాయి.  శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమా టీజర్ ప్రేమికుల దినోత్సవం రోజున అంటే ఫిబ్రవరి 14 వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు.