చై.. సమంతల ఫస్ట్ వెడ్డింగ్ డే గిఫ్ట్ ఇదే..!!

చై.. సమంతల ఫస్ట్ వెడ్డింగ్ డే గిఫ్ట్ ఇదే..!!

అక్కినేని నాగ చైతన్య.. సమంతలు సినిమా జీవితంలో చాలా బిజీ అయ్యారు.  చై నటించిన శైలజా రెడ్డి అల్లుడు, సమంత యూటర్న్ సినిమాలు వినాయక చవితి రోజున విడుదలౌతున్నాయి.  ఏం మాయచేశావే సినిమా తరువాత ఇద్దరు కలిసి ఆటో నగర్ సూర్య, మనం సినిమాలో నటించారు. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు స్క్రీన్ ను పంచుకోబోతున్నారు.  శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న కొత్త సినిమాలో కలిసి నటించబోతున్నారు.  నాగ చైతన్య.. సమంత ఫస్ట్ యాన్యువల్ వెడ్డింగ్ డే రోజైన అక్టోబర్ 6 వ తేదీన ఈ సినిమా ప్రారంభం కాబోతున్నది.  

హిందీ టీవీ నటి దివ్యంష కౌశిక్ ఇందులో కీలక పాత్ర చేస్తున్నది.  గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు.  మిగతా విషయాలను యూనిట్ త్వరలోనే వెల్లడిస్తుంది.