భార్య సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్న భర్త...!

భార్య సినిమాలో గెస్ట్ రోల్ చేయనున్న భర్త...!

అక్కినేని కోడలు సమంత గురించి అందరికి తెలుసు. పెళ్లి అయిన తరువాత కూడా తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే ఈ సంవత్సరం వచ్చిన  జాను సినిమాతో కొంచెం నిరాశపరిచింది సమంత. అయితే తన తరువాత సినిమా లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో చేయనుంది. అయితే వీరిద్దరి కాంబినేషన్ లో గత ఏడాది వచ్చిన  ఓ బేబీ సినిమా సూపర్ హిట్ అందుకుంది. అయితే ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి సినిమా చేయనున్నారు. అయితే ఈ సినిమా గురించి ఓ వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదేంటంటే... ఈ సినిమాలో సమంత భర్త నాగ చైతన్య ఓ  గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడట. అయితే  ఓ బేబీ సినిమాలో కూడా చైతన్య కనిపిస్తాడు కానీ చాల తక్కువ సమయం కానీ ఇప్పుడు ఈ సినిమాలో చైతన్య పాత్ర కొంచెం ఎక్కువ సమయమే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.  అయితే చూడాలి  మరి ఏం జరుగుతుంది అనేది.