అర్జునుడు గెటప్ లో నాగచైతన్య అదుర్స్

అర్జునుడు గెటప్ లో నాగచైతన్య  అదుర్స్

 

అక్కినేని కుటుంబంలో నాగేశ్వర రావు తరువాత.. పౌరాణిక పాత్రల్లో నటించిన హీరోలు చాలా తక్కువనే చెప్పాలి.  నాగార్జున పౌరాణిక పాత్రలున్న సినిమాల్లో నటించలేదు.  ఇప్పుడు నాగార్జున తనయుడు, నాగచైతన్య.. అర్జునుడిగా నటిస్తున్నాడు.  అర్జునుడు అంటే ఇదేదో పౌరాణిక సినిమా అనుకుంటే పొరపాటే..అర్జునుడికే సవ్యసాచి అనే పేరు కూడా ఉన్నది.  సవ్యసాచి సినిమాలో అర్జునుడు గెటప్ లో నాగచైతన్య కాసేపు అలరించబోతున్నాడు.  ఇందులో సుభద్ర పరిణయం అనే చిన్న ఎపిసోడ్ ఉండబోతున్నది.  ఈ ఎపిసోడ్ లో చైతన్య అర్జునుడుగా అలరించబోతున్నాడు.  నవంబర్ 1 వ తేదీ ఉదయం 10 గంటలకు దీనికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.  నవంబర్ 2 న సినిమా రిలీజ్ కాబోతున్నది.  నిధి అగర్వాల్ హీరోయిన్.