అందరూ నవ్వి నవ్వి ఎంజాయ్ చేస్తారంటున్న నాగ చైతన్య !
నాగ చైతన్య ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో చేసిన చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం వచ్చే నెల 13వ తేదీన విడుదలకానుంది. రేపు 31న సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నారు. మారుతి గత చిత్రాలు రెండు మంచి హిట్లు కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.
చిత్ర ట్రైలర్ గురించి నాగ చైతన్య మాట్లాడుతూ మారుతి రైటింగ్ కు అందరూ తప్పకుండా నవ్వి నవ్వి ఎంజాయ్ చేస్తారు, ట్రైలర్ రిలీజ్ అంటే కొంచెం కంగారుగా, కొంచెం ఎగ్జైటింగా ఉంది అంటూ ట్వీట్ చేశారు. దీన్నిబట్టి సినిమాలో ఎంటర్టైన్మెంట్ పక్కా అని అర్థమైపోతోంది. ఈ చిత్రంలో చైతన్యకు జోడీగా అను ఇమ్మాన్యుయేల్ నటించగా రమ్యకృష్ణ ఆయనకు అత్త పాత్రలో కనిపించనున్నారు.
Yes yes yes the trailer of #ShailajaReddyAlludu will be out tomorrow .. nervous , excited and at the same time confident @DirectorMaruthi writing ki pakka andharu navvi navvi enjoy chesthaar ani .. so cant wait to show you all .. see you guys tomorrow !! pic.twitter.com/LHD7wZjBP4
— chaitanya akkineni (@chay_akkineni) August 30, 2018
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)