"లవ్ స్టోరీ" పై వస్తున్నవి అని పుకార్లే : చిత్ర బృందం

"లవ్ స్టోరీ" పై వస్తున్నవి అని పుకార్లే : చిత్ర బృందం

నాగచైతన్య హీరోగా లవ్ స్టోరీ సినిమా చేస్తున్నారు.  శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా చేస్తున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  శేఖర్ కమ్ముల సినిమాలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి.  ఈ విషయం అందరికి తెలిసిందే. అయితే ఫిదా వంటి సూపర్ హిట్ సినిమా తరువాత శేఖర్ కమ్ముల నాగ చైతన్యతో చేస్తున్నారు. అయితే ఈ సినిమా గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అవేంటంటే... ఈ సినిమా క్లైమాక్స్ పై చైతు అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే సాయి పల్లవి నటన గురించి మన అందరికి తెలుసు. అయితే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా అదే సమస్య అని వార్తలు వస్తున్నాయి. పల్లవి తన నటనతో చైతును డామినేట్ చేసిందని అది తనకు నచ్చలేదని సమాచారం. అయితే ఈ విషయం పై స్పందించిన "లవ్ స్టోరీ" చిత్ర బృందం ఇవ్వని వాటి పుకార్లు మాత్రమే. ఈ సినిమాలో ఇద్దరికి సమానమైన పాత్రలు ఉన్నాయి అని తెలుపుతూ ఇంతక ముందు వచ్చినవి అని పుకార్లే అని తేల్చేసారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.