చైతు మజిలీ ప్రయోగం ఫలిస్తుందా..?

చైతు మజిలీ ప్రయోగం ఫలిస్తుందా..?

నాగచైతన్య.. సమంత జంటగా నటిస్తున్న సినిమా మజిలీ.  శివ నిర్వాణ దర్శకుడు.  ఈ సినిమా పీరియాడికల్ స్టోరీ అని అంటున్నారు.  1990 లో కొన్ని సీన్స్ ఉంటాయట.  దానికి కొనసాగింపుగా ఇప్పటి సీన్స్ వస్తుంటాయి.  కథ రెండు పార్శ్వాలలో ఉంటుందని తెలియడంతో.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు.  

నాగచైతన్య సినిమాలు వరసగా బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతున్నాయి.  యుద్ధం శరణం, శైలజా రెడ్డి అల్లుడు, ఇటీవలే వచ్చిన సవ్యసాచి సినిమా కూడా పెద్దగా ఆకట్టుకోలేదు.  మాస్ హీరోగా చేయాలని చేసిన ప్రయత్నం సఫలం కాలేకపోయింది.  ఇప్పుడు మజిలీ పేరుతో చేస్తున్న ప్రయోగం ఎలా ఉంటుందో అని అభిమానులు ఆవేదన చెందుతున్నారు.  ఈ సారైనా చైతు ప్రయోగం ఫలించాలని కోరుకుందాం.