నాగ చైతన్య, సాయి పల్లవి.. క్యూట్ కాంబినేషన్

నాగ చైతన్య, సాయి పల్లవి.. క్యూట్ కాంబినేషన్

'మజిలీ' విజయంతో హీరో నాగ చైతన్య వరుస సినిమాలకు సైన్ చేస్తున్నారు.  ప్రస్తుతం 'వెంకీ మామ'లో నటిస్తున్న ఆయన దిల్ రాజు నిర్మాణంలో ఒక సినిమా, మేర్లపాక గాంధీ డైరెక్షన్లో ఇంకో సినిమా ఒప్పుకుని ఉన్నారు.  ఈ రెండూ కాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక సినిమా చేయాలని చైతూ అనుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. 

'ఫిదా' తరవాత కొత్త వాళ్లతో ఒక ప్రాజెక్ట్ సెట్ చేసిన శేఖర్ కమ్ముల ఆ సినిమా మొదలవడానికి ఇంకా కొంత సమయం పడుతుంది కాబట్టి ఈలోపు చైతన్యతో ఒక సినిమా చేసేయాలని, అందులో సాయి పల్లవిని కథానాయకిగా తీసుకోవాలని భావిస్తున్నారట.  ఒకవేళ ఈ కాంబినేషన్ సెట్టైతే అన్ని విధాలా కొత్తగా ఉంటుంది.  మరి ఇది కుదురుతుందో లేదో తెలియాలంటే కమ్ముల లేదా చైతూల్లో ఎవరో ఒకరి నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ అందేవరకు ఎదురుచూడాల్సిందే.