రెండవ వారం నుండి మొదలుపెట్టనున్న చైతు, సమంత !

రెండవ వారం నుండి మొదలుపెట్టనున్న చైతు, సమంత !

నాగ చైతన్య, సమంతలు ఇద్దరూ కలిసి నటించనున్న ఈ సినిమా జూలైలో మొదలైన సంగతి తెలిసిందే.  గత  పూర్తికావడంతో చైతూ, సమంతలు ఈ నెల 2వ వారం నుండి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్లో పాల్గొననున్నారు.  'నిన్నుకోరి' ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నారు. 

సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  గతంలోనే చెప్పినట్టు ఈ చిత్రానికి 'మజిలీ' అనే టైటిల్ ను పెట్టనున్నారట.  ఫిల్మ్ ఛాంబర్లో ఇప్పటికే ఈ టైటిల్ ను రిజిస్టర్ చేయించారు నిర్మాతలు.  పెళ్ళైన తరవాత చైతన్య, సమంతలు కలిసి చేస్తున్న మొదటి చిత్రం కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.