చై.. శామ్ ల కొత్త సినిమా స్టోరీ ఇలాగే ఉంటుందా..?

చై.. శామ్ ల కొత్త సినిమా స్టోరీ ఇలాగే ఉంటుందా..?

టాలీవుడ్ లో మోస్ట్ సెలబ్రిటీ ఫ్రెష్ కపుల్ ఎవరు అంటే నాగ చైతన్య.. సమంత అనే చెప్తారు.  ఇద్దరు కలిసి మూడు సినిమాల్లో నటించారు.  మొదటి సినిమా ఏం మాయ చేశావే.  ఈ సినిమాలో ఇద్దరు మాయ చేశారు.  రెండో సినిమా ఆటో నగర్ సూర్య పెద్దగా హిట్ కాలేదు.  మూడో సినిమా మనం.  ఈ సినిమాలో ఈ ఇద్దరు నటించలేదు.. జీవించారని చెప్పొచ్చు.  ఇద్దరిమధ్య వచ్చే రొమాంటిక్ సీన్స్ లో ఒదిగిపోయి నటించారు.  

ఆ తరువాత ఈ ఇద్దరికీ పెళ్లి జరిగింది.  పెళ్ళయ్యిన ఏడాది తరువాత ఈ ఇద్దరు కలిసి మజిలీ అనే సినిమాలో నటిస్తున్నారు.  పెళ్లికి ముందే మనం లాంటి సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో అద్భుతంగా కనిపించిన ఈ ఇద్దరు.. ఇప్పుడు మజిలీ సినిమాలో ఇంకెంత రొమాంటిక్ గా నటిస్తారో అని అంతా అనుకుంటున్న సమయంలో.. ఇది భార్య భర్తల మధ్య స్టోరీనేకానీ, రొమాంటిక్ సినిమా కాదని.. ఇందులో నాగచైతన్య క్రికెటర్ గా కనిపిస్తే.. సమంత క్రికెట్ అంటే పడని వ్యక్తిగా కనిపిస్తుందట.  ఇద్దరిమధ్య క్రికెట్ ఎలాంటి గేమ్ ఆడిందో సినిమా ద్వారా దర్శకుడు శివ నిర్వాణ చెప్పబోతున్నట్టు సమాచారం.