స్పీడ్ పెంచిన చైతన్య, సమంత !

స్పీడ్ పెంచిన చైతన్య, సమంత !

స్టార్ కపుల్ నాగ చైతన్య, సమంతలు కలిసి చేస్తున్న చిత్రం 'మజిలీ'.  శివ నిర్వాణ డైరెక్షన్లో ఈ చిత్రం రూపొందుతోంది.  ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ఇటీవలే వైజాగ్లో ఒక షెడ్యూల్ ముగించిన టీమ్ ఈ నెల 26 నుండి రెండవ షెడ్యూల్ మొదలుపెట్టనుంది.  ఈ చిత్రంలో చైతు, సమంతలు భార్యాభర్తలుగా కనిపించనున్నారు.  

వివాహం ఆయిన తరవాత వీరిద్దరూ కలిసి చేస్తున్న మొదటి ప్రాజెక్ట్ కావడంతో ప్రేక్షకుల్లో సినిమాపై ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది ఉంది.  గోపి సుందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  ఇందులో దివ్యాన్ష కౌశిక్ రెండవ కథానాయకిగా నటిస్తోంది.