పవన్ కళ్యాణ్ గురించి చైతన్య ఏమన్నాడంటే..!!

పవన్ కళ్యాణ్ గురించి చైతన్య ఏమన్నాడంటే..!!

శైలజా రెడ్డి అల్లుడు సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా అక్కినేని నాగ చైతన్య ట్విట్టర్ లో ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.  చైతు పనిచేసిన హీరోయిన్ల గురించి అడిగిన ప్రశ్నలకు చాలా క్యూట్ గా సమాధానం చెప్పారు.  ముఖ్యంగా రకుల్ ప్రీత్ భ్రమరాంబ పాత్ర గురించి అడిగిన ప్రశ్నకు భ్రమరాంబ క్యారెక్టరైజేషన్ విధానం బాగుందని.. రకుల్ ఆ పాత్రలో ఒదిగిపోయి నటించిందని చెప్పారు.  ఏఆర్ రెహ్మాన్ గురించి అడిగిన ప్రశ్నకు.. అది అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు.  సమంత గురించి అడిగిన ప్రశ్నకు తన జీవితానికి సూపర్ స్టార్ చెప్తూనే.. తన పర్సనాలిటీ బాగా నచిందని.. వివాహం తరువాత జీవితం ఇంకా బాగుందని చెప్పారు.  రామ్ చరణ్ సినిమాల్లో రంగస్థలం, ప్రభాస్ సినిమాల్లో బాహుబలి, మహేష్ బాబు సినిమాల్లో పోకిరి అలాగే వెంకటేష్ సినిమాల్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా అంటే బాగా ఇష్టమని చెప్పారు.  జూనియర్ ఎన్టీఆర్ సినిమాలన్ని చూస్తానని చెప్పిన చైతు.. యమదొంగ సినిమా అంటే చాలా ఇష్టమని చెప్పారు.   ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటారని అన్నాడు.  పవన్ కళ్యాణ్ ను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారని, అందులో తాను కూడా ఒకడినని చైతు అన్నాడు.