సభ సాక్షిగా సారీ చెప్పిన నాగ చైతన్య !

సభ సాక్షిగా సారీ చెప్పిన నాగ చైతన్య !

అక్కినేని నాగ చైతన్య నటించిన తాజా చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు' చిత్రం గత గురువారం విడుదలై మంచి ఓపెనింగ్స్ రాబట్టుకుంది.  మూడు రోజుల్లోనే 22 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసి చైతన్య కెరీర్లోనే భారీ మంచి ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా నిలిచింది.  ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. 

అందులో మీడియాతో మాట్లాడిన నాగ చైతన్య తన సినిమా కొందరు విమర్శకులకు అంతగా నచ్చలేదని, అందుకు తాను సారీ చెబుతున్నానని, నెక్స్ట్ సినిమాకు ఇంకా కష్టపడి పనిచేస్తానని అన్నారు.  మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించింది.