నాగ చైతన్య కెరీర్లో ఇదే హైయెస్ట్ !

నాగ చైతన్య కెరీర్లో ఇదే హైయెస్ట్ !

నాగ చైతన్య హీరోగా, మారుతి డైరెక్షన్లో రూపొందిన 'శైలజారెడ్డి అల్లుడు' ఈరోజే విడుదలైంది.  మొదటి నుండి మంచి బజ్ ఉన్న ఈ  ఓవర్సీస్లో కూడ మంచి స్థాయిలోనే విడుదలైంది.  సుమారు 151 లొకేషన్లలో ప్రీమియర్ల ద్వారా ప్రదర్శితమైన ఈ సినిమా 107,461 డాలర్లను వసూలు చేసింది. 

ఇప్పటి వరకు చైతన్య కెరీర్లో ఇదే ఉత్తమమైన ఓపెనింగ్స్ కావడం విశేషం.  ఈ వసూళ్లతో చైతన్యకు యూఎస్ మార్కెట్ మరింత బలపడిందనుకోవచ్చు.  కొన్నేళ్ల క్రితం విడుదలైన 'మనం' 95,473 డాలర్లతో 2వ స్థానంలో నిలవగా 'ప్రేమమ్' 74,219 డాలర్లతో మూడవ స్థానంలో నిలిచింది.